Bigg Boss 6 Telugu 9th Week Elimination: ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుండి తొమ్మిదో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే రోజు వచ్చేసింది. నిజానికి ఎలిమినేషన్ ఆదివారమే అయినా శనివారమే ఆదివారం షూట్ కూడా జరుగుతుందని అందరికీ తెలుగు. ఈ క్రమంలో ఈరోజే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలిసి పోయింది. నిజానికి ఈ సీజన్లోకి అర్జున్ కళ్యాణ్, గీతూ రాయల్, అభినయశ్రీ, కీర్తి బట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్, మెరీనా, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జె సూర్య,  ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, ఆరోహి రావు, సింగర్ రేవంత్ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిలో ఇప్పటికే షానీ సాల్మన్, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చంటి, సుదీప, అర్జున్, సూర్య ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం దాదాపు పది మంది నామినేట్ అయ్యారు ఇనయా సుల్తానా, బాలాదిత్య, ఆదిరెడ్డి, గీత రాయల్, కీర్తి బట్, శ్రీ సత్య, రేవంత్ , ఫైమా, మెరీనా, రోహిత్ ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే ఈ తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అనూహ్య మలుపులతో సాగినట్లు తెలుస్తోంది.


అందుతున్న సమాచారం మేరకు ఈ ఓటింగ్ ముగిసే సమయానికి రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్ ప్లేస్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఇనయా సుల్తానా కూడా గతంలో కంటే పుంజుకుని రేవంత్కు గట్టి పోటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆ తర్వాత స్థానాలలో బాలాదిత్య, కీర్తి భట్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య ఉన్నారని వీళ్లంతా సేఫ్ అయినట్లేనని తెలుస్తోంది. ఇక మెరీనా, ఫైమా, గీతూ రాయల్ డేంజర్ జోన్ లో ఉండగా ఇప్పుడు అనూహ్యంగా గీతూ రాయల్ ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీక్స్ ద్వారా తెలుస్తోంది.


ఒకరకంగా గీతూ ఫైనల్ ఎపిసోడ్ వరకు నిలబడి టాప్ ఫైవ్ లా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు గీత ఎలిమినేట్ అయిందని వార్త షాక్ కలిగిస్తోంది. అయితే ఆమెను సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతూ ఉండగా అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రసారమైతే కానీ చెప్పలేం.


Also Read: Arjun Vishwaksen Issue : నాడు విశ్వక్ సేన్ చెప్పింది అబద్దమా?.. అర్జున్ ఆవేదన ఇదే.. జీవితంలో ఇలా చేయలేదట


Also Read: Mythri Movie Makers: దిల్ రాజుకు షాకిచ్చేందుకు మైత్రీ స్కెచ్.. కొత్త ఆఫీస్ సెటప్ కూడా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook